
ఎఫెక్ట్
ఆసిఫాబాద్: జిల్లాలో అగ్నిప్రమాదాల్లో ఆస్తులు బూడిదవుతున్నాయని, అగ్నిమాపక సి బ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం లేదని గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఫైర్.. ఫెయిల్!’ కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఫైర్ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్‌డ్రిల్‌తో వివరించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, ప్రవీణ్, శరత్, రాము, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎఫెక్ట్