
సందర్శించి.. పరిశీలించి
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం గిరి జనశాఖ డీడీ రమాదేవి సందర్శించారు. తరగతి గదులు, వంట గదులను పరిశీలించి వి ద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీఆర్టీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. అంతకు ముందు పాటగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. త్వరలో పాఠశాల భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎంపీడీవో అంజద్‌పాషా, హెచ్‌ఎం పంచఫుల పాల్గొన్నారు.