
జలం.. జర భద్రం!
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులు నిండుగా చెరువులు, కుంటలు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్న యువకులు రక్షణ చర్యలు కల్పించడంలో యంత్రాంగం విఫలం
చింతలమానెపల్లి మండలం దిందా గ్రా మానికి చెందిన సెడ్మెక సుమన్(18) జూ లై 10న దిందా వాగు దాటుతూ వరద ఉ ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. చే తికందిన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని వేదన మిగిలింది.
చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన జోడి గురుదాస్(28) ఆగస్టు 23న పశువులను నీటి కుంటలో కడిగేందుకు తీసుకెళ్లాడు. మట్టి తవ్వకాలతో కుంట లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో పడి మృతి చెందాడు.
మే 24న కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన పిప్పిరి హేమంత్(16) పెద్దవాగులో సాన్నం చేసేందుకు వెళ్లాడు. వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ లక్ష్మి(13), మహారాష్ట్రలో ని ఎటపల్లికి చెందిన సిండే హన్షిక(11) మే 23న వ్యవసాయ చేనులోని చెరువు కుంట వద్ద ఆడుకుంటూ నీటిలో మునిగి మృతి చెందారు.
కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన రాథోడ్ అంకిత్(15) గత నెల 31న ఇద్దరు స్నేహితులతో కలిసి కోసిని డ్యాం చూసేందుకు వెళ్లాడు. అంకిత్ స్నానం చేసేందుకు డ్యాంలోకి దిగగా, లోతు ఎక్కువ ఉండడంతో నీటిలో గల్లంతై మృతి చెందాడు. చేతికందిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
కౌటాల(సిర్పూర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, వార్ధా, పెన్‌గంగ, పెద్దవాగు నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, బావులు కూడా నిండుగా ఉన్నాయి. ఈ సమయంలో యువకులు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల వద్ద పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టడంతో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏటా ఘటనలు పునరావృతమవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లోని పె న్‌గంగ, ప్రాణహిత, వార్ధా నదుల వద్ద సాన్నాలకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కో ల్పోవడం కుటుంబాల్లో విషాదం నింపుతోంది.
ఏటా ప్రమాదాలు..
ఖాళీ సమయాలు, సెలవు రోజుల్లో ఈత సరదా కోసం బాలురు, యువకులు వ్యవసా య బావులు, చెరువులు, కుంటల వద్ద వెళ్తున్నారు. కొందరు వచ్చీరాని ఈత కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు ఊబిలో కూరుకుపోయి శ్వాస విడుస్తున్నారు. చెరువులు, కుంటల్లో మొరం కోసం ఇష్టారాజ్యంగా తవ్వకాలతో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఇవేవీ గమనించకుండా చేపల వేటకు వెళ్లిన వారు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. జలాశయాల్లో నీరు అధికంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కాపలాదారు(లస్కర్)ల పర్యవేక్షణ ఉండాలి. నీటిలోకి దిగకుండా నియంత్రించాలి. ప్రవాహ ఉధృతి ఉన్నచోట, లోతైన చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఉపాధి పను ల కింద నిర్మించి చెక్‌డ్యాంలు, కుంటలు, ఫారంపాండ్లు ఉన్న చోట స్థానికంగా పంచాయతీ అధికా రులు దండోరా ద్వారా హెచ్చరికలు జారీ చేయాలి. కానీ యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.
నదుల పరీవాహకంలో ప్రమాదాలు
కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణ హిత నది మొదలై.. చింతలమానెపల్లి మండలం రణవెల్లి, భూరెపల్లి, కోర్సిని, దిందా, చిత్తాం, గూడెం, బూరుగూడ, బెజ్జూర్ మండలం సోమిని, తలాయి, పెంచికల్‌పేట్ మండలంలోని మురళీగూడ, దహెగాం మండలం మొట్లగూడ, రాంపూర్ గ్రామాల వరకు ప్ర వాహం ఉంటుంది. అలాగే పెన్‌గంగ నది సి ర్పూర్(టి) మండలం హుడ్కిలి, టోంకిని, వెంకట్రావుపేట, లోనవెల్లి, కౌటాల మండలంలోని వీరవెల్లి, తాటిపల్లి, వీర్ధండి, గుండాయిపేట వరకు ప్రవహిస్తుంది. సమీప గ్రా మాల్లోని ప్రజలు నిత్యం ఇక్కడికి సాన్నాల కోసం నదుల వద్దకు వెళ్తుంటారు. మహారా ష్ట్రకు నాటు పడవల్లోనూ ప్రయాణాలు సాగి స్తుంటారు. నదుల ఒడ్డున రక్షణకు నీటి జాకె ట్లు, గాలి నింపిన ట్యూబ్‌లు ఎక్కడా ఏర్పా టు చేయలేదు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్న పరీవాహక ప్రాంతాల్లోనే తరచూ ప్ర మాదాలు నమోదవుతున్నాయి. స్నానాలకు అనువైన ప్రదేశాలను గుర్తించడం లేదు. ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయడం లేదు. ఉన్నతా ధికారులు స్పందించి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవలి ఘటనలు
పిల్లలపై దృష్టి సారించాలి
బాలలు ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి స్నానాలకు వెళ్తుంటారు. వర్షాకాలం నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. నదులు, వాగుల వద్దకు పంపించొద్దు. రెవెన్యూ, పంచాయ తీ, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– ఎండీ వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్