
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ఆసిఫాబాద్‌రూరల్: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఎస్‌వో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం క్రీడామైదానంలో శుక్రవారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు ప్రారంభించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురువేందర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన 24 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో మహబూబాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా కోచ్ రాకేశ్, పీడీలు రాజశేఖర్, యాదగిరి, చిరంజీవి, శిరీష, సునీత, హరిక తదితరులు పాల్గొన్నారు.