
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్, బ్యూరో ఇన్‌చార్జి, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులను ఉపేక్షించొద్దు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు.
– దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిచడం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం.
– భగత్ మహేందర్, అడ్వకేట్
మీడియా గొంతు నొక్కడం సరికాదు

కేంద్ర ప్రభుత్వం స్పందించాలి