
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షు డు ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ వసతిగృహాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూనియన్ జిల్లా కార్యదర్శి వసంత్‌రావు, కోశాధికారి రాంబాయి, వర్క ర్లు గంగుబాయి, జంగుబాయి, రాధాబాయి, లక్ష్మి, సదాశివ్, సంతోష్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.