
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్: పదోన్నతితో ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. జోడేఘాట్ రేంజ్ ఎఫ్‌బీవోగా విధులు నిర్వర్తించి ఎఫ్‌ఎస్‌వోగా పదోన్నతి పొందిన స్వప్నకు జిల్లా కేంద్రంలో బుధవారం పదోన్నతి చిహ్నం అందించారు. ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి ఒక డీఆర్‌వో, ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు జిల్లాకు వచ్చారని తెలిపా రు. అలాగే జిల్లాలో ఒక సెక్షన్ అధికారికి పదోన్నతి లభించిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సిబ్బంది పాల్గొన్నారు.