
‘ఉత్తమ’ టీచర్లకు సన్మానం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా ఉత్తమ టీచర్లుగా ఎంపికై న 55 మంది ఉపాధ్యాయులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే బుధవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి సన్మానించారు. ముందుగా మాజీ ఉ ప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందించి శాలువాలతో సన్మానించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్, డీటీడీవో రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్, ఎస్‌వోలు శ్రీనివాస్, మధుకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.