
నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ ము న్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభా లు, తీగలు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటూ ‘మేలుకోకుంటే కాటేస్తయ్’ అనే శీర్షికతో ఆగస్టు 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు, అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వంగి ఉన్న స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని పలు మార్లు ‘సాక్షి’లో వార్తలు ప్రచురితం కావడంతో నూతన స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే వినా యక నిమజ్జన శోభాయాత్ర రోజు విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన 12 మంది సిబ్బందికి విధులు కేటాయించామని ఏఈ కమలాకర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఎఫెక్ట్

నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు