ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కిష్టారం బీసీ కాలనీకి చెందిన ఇమ్మనబోయిన వెంకటనారాయణ, సుజాతనగర్‌కు చెందిన విష్ణుప్రియ(38) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, సోమవారం రాత్రి 10గంటల వరకు కుటుంబీకులతో ఉన్న విష్ణుప్రియ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుంది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు, అక్కడి నుంచి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, విష్ణుప్రియ మృతికి కారణాలు తెలియకపోవడం, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె కుటుంబీకులను కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ తదితరులు పరామర్శించారు.

కాల్వలో చిక్కుకున్న అడవిదున్న మృతి

వేంసూరు: వేంసూరు మండలం చౌడవరం – కల్లురుగూడెం సమీపాన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పక్కన మామాడి తోటల్లో మూడు రోజుల క్రితం సంచరించిన అడవిదున్న మృతి చెందింది. తోటల్లో సంచరించిన అడవి దున్న పంట కాల్వలో చిక్కుకుంది. ఈమేరకు హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ బృందాలు అడవి దున్నను కాల్వలో నుంచి బయటకు తీసేందుకు మంగళవారం ప్రయత్నిస్తుండగా, ఆహారం లేక తీవ్రంగా నీరసించి మృతి చెందింది. ఈమేరకు పోస్టుమార్టం అనంతరం అడవి దున్న కళేబరాన్ని కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో ఖననం చేసినట్లు సత్తుపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సీహెచ్‌.ఎల్లయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement