పోలింగ్‌ పూర్తి.. మొదలైన లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ పూర్తి.. మొదలైన లెక్కింపు

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● ‘రెడ్‌క్రాస్‌’లో 48.31శాతం పోలింగ్‌ ● అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

● ‘రెడ్‌క్రాస్‌’లో 48.31శాతం పోలింగ్‌ ● అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఖమ్మం సహకారనగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ(ఐఆర్‌సీఎస్‌) జిల్లా మేనేజింగ్‌ కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో పోలింగ్‌ ఏర్పాటుచేయగా, ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు 2,430మంది ఓటర్లలో 1,174మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదు పోలింగ్‌ బూత్‌లకు గాను ఒక్కో బూత్‌లో 500మందిని కేటాయించారు. కాగా, అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్‌, ఆతర్వాత పెరుగుతూ సమయం ముగిసేసరికి 48.31శాతంగా నమోదైంది.

4గంటల నుంచి లెక్కింపు

పోలింగ్‌ ముగిశాక సాయంత్రం 4గంటల నుంచి ఎన్నికల అధికారి, సీపీఓ శ్రీనివాస్‌ నేతృత్వాన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అయితే, అర్ధరాత్రి వరకు కూడా లెక్కింపు కొనసాగుతోంది. పోలైన 1,174ఓట్లను 25 చొప్పున బండిళ్లుగా కట్టి లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 39మంది పోటీలో ఉండగా, 15మందిని ఎన్నుకోవాల్సి ఉంది. సోమవారం తెల్లవారేకల్లా ఫలితం వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement