ఖమ్మంఅర్బన్: జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా కాపాడేందు కు సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలా లు విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. చివరి తడి వరకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నందున సాగర్ ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశా రు. అయితే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
కూటమిని గెలిపిస్తేనే
ఆర్టీసీ పరిరక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు తీరును గమనించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఖమ్మం రీజియన్ గౌరవ అధ్యక్షుడు బీ.జీ.క్లెమెంట్ సూచించారు. ఖమ్మంలో ఆదివా రం జరిగిన రీజియన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అశ్వథామరెడ్డి నాయకుడి ముసుగులో కార్మికులకు ద్రోహం చేశారని ఆరోపించారు. కార్మికుల జీతభత్యాలు, పీఆర్సీ, పెండింగ్ డిమాండ్ల సాధనలో అశ్వథామరెడ్డి యాజమాన్యంతో కుమ్మక్కు కాకపోతే ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యేదని తెలి పారు. కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఎంప్లాయీస్ యూనియన్ పోరాడుతుందని గుర్తించి ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూని యన్, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమిని గెలిపించాలని.. తద్వారా సంస్థ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఖమ్మం రీజియన్‌లో ఎన్‌ఎంయూ కాగడా గుర్తు, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపునకు ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నాయకులు శివరామకృష్ణ, టి.రామాంజనేయులు, జి.లక్ష్మీనారాయణ, పి.అప్పారావు, పి.రమేష్, బోడ వీరన్న, ఎన్.కృష్ణ, బుచ్చిబాబు, జేకే, లాదర్, వల్లపు వెంకన్న పాల్గొన్నారు.


