వేగంగా చేయూత పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వేగంగా చేయూత పరిశీలన

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

● ప్రత్యేక యాప్‌తో ఇంటింటికీ అధికారులు ● జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం 25,912 దరఖాస్తులు ● ఈనెల 25 నాటికి పరిశీలన పూర్తికి చర్యలు

మున్సిపాలిటీలు, మండలాల వారీగా

దరఖాస్తులు, పరిశీలన వివరాలు

● ప్రత్యేక యాప్‌తో ఇంటింటికీ అధికారులు ● జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం 25,912 దరఖాస్తులు ● ఈనెల 25 నాటికి పరిశీలన పూర్తికి చర్యలు

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో నూతన చేయూత పింఛన్‌ దరఖాస్తుల పరిశీలనను యంత్రాంగం వేగవంతం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్పొరేషన్‌, మున్సిపల్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈమేరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశాక, ప్రత్యేక యాప్‌ ద్వారా అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పరిశీలన మొదలుపెట్టారు. సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయగానే అర్హత, అనర్హతల వివరాలు వెల్లడవుతున్నాయని తెలిపారు. ఈనెల 25వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు.

దరఖాస్తుల నమోదులో ముందంజ

జిల్లాలో నూతన పింఛన్ల కోసం మొత్తం 25,912 దరఖాస్తులు రాగా, ఇప్పటికే 22,564 దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశారు. అంతేకాక క్షేత్రస్థాయిలో 1,926 దరఖాస్తులను పరిశీలించారు. అందులో 1,868 దరఖాస్తులకు అర్హత ఉందని నిర్ధారించగా, వివిధ కారణాలతో 58 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. కాగా, జిల్లాలో అత్యధికంగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 4,410 దరఖాస్తులు రాగా, చింతకాని మండలంలో 1,426, ముదిగొండలో 1,257, నేలకొండపల్లిలో 1,168 దరఖాస్తులు నమోదయ్యాయి. అత్యల్పంగా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 375, సత్తుపల్లి మున్సిపాలిటీలో 523, మధిర మున్సిపాలిటీలో 566 దరఖాస్తులు అందాయి.

పరిశీలనలో ఏదులాపురం టాప్‌..

పెన్షన్‌ దరఖాస్తుల పరిశీలన అనంతరం వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో అందిన 1,029 దరఖాస్తులకు ఇప్పటి వరకు 270 పరిశీలన పూర్తి చేశారు. ఆ తర్వాత నేలకొండపల్లిలో 177, మధిర మండలంలో 163, రఘునాథపాలెంలో 128 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇక పెనుబల్లి మండలంలో 838 దరఖాస్తులు అందితే కేవలం రెండు దరఖాస్తులనే పరిశీలించడం గమనార్హం.

మండలం / మున్సిపాలిటీ దరఖాస్తులు

ఖమ్మం కార్పొరేషన్‌ 4,410 28

ముదిగొండ 1,257 57

చింతకాని 1,426 108

తిరుమలాయపాలెం 1,132 58

నేలకొండపల్లి 1,168 177

కారేపల్లి 857 39

కొణిజర్ల 978 66

ఖమ్మంరూరల్‌ 921 53

బోనకల్‌ 977 82

ఏదులాపురం 1,029 270

పెనుబల్లి 838 2

రఘునాథపాలెం 890 128

ఎర్రుపాలెం 896 34

వైరా మున్సిపాలిటీ 692 16

వైరా 720 77

సత్తుపల్లి 800 17

వేంసూరు 711 27

కామేపల్లి 625 55

ఏన్కూరు 610 113

కల్లూరు 727 54

సత్తుపల్లి మున్సిపాలిటీ 523 36

మధిర 666 163

కల్లూరు మున్సిపాలిటీ 375 22

తల్లాడ 977 88

మధిర మున్సిపాలిటీ 566 28

కూసుమంచి 1,141 28

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement