ఖమ్మం సహకారనగర్: నాణ్యమైన విద్య అందాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఖమ్మంలో విద్యాభిమానులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ విద్యావ్యవస్థ ఐసీయూలో ఉన్నందున ప్రజలే వైద్యులుగా మారి చికిత్స చేసి బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మారిస్తే ప్రైవేట్ బడులకు పిల్లలను పంపాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. యుడైస్ గణాంకాలు ప్రకారం తెలంగాణలో 2,582 పాఠశాలలు ఒకే గదిలో నడుస్తున్నాయని, 2,245పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానాన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రైవేట్ పాఠశాలల నియంత్రణ చట్టం చేసి, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా, ఎం.చంపాలాల్. పి.అశోక్ కుమార్, సృజన యాదవ్, ఎం.కుపోరన్న, ఎం.నర్సింహరావు, హరీష్, రుబీనా, నిఖిల్, జగదీష్ తదితరులు పాల్గొనగా.. జిల్లా నుంచి వివిధ సంఘాల బాధ్యులు ఎన్.తిర్మల్, డాక్టర్ ఎం.ఎఫ్.గోపినాథ్, భద్రూనాయక్, కట్టా శేఖర్, జి.మల్లయ్య, ఉద్దండు, సుంకర శ్రీనివాస్, మస్తాన్, పి.రాంబాబు, కనకయ్య, టి.వేణు, నాగిరెడ్డి, దేవేందర్, బొబ్బిలి భారత్‌చంద్ర, మణి భూషణాచారి, ఖలీల్, ఝూన్సీ, సునీత, సృజన, విజయకుమార్, గుంతేటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి


