కల్లూరురూరల్: కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం సీ్త్రనిధి రుణాల్లో గోల్‌మాల్ జరిగింది. గ్రామంలో 22 మహిళా సంఘాలకు ఇచ్చిన రూ.43 లక్షల రుణాలు లెక్క తేలడం లేదు. రుణాలను క్రమం తప్పకుండా మహిళలు చెల్లించినా రికార్డుల్లో నమోదు కాకపోవడంతో వారు బుధవారం కల్లూరులోని సీ్త్ర శక్తి భవన్ ముందు నిరసన తెలిపారు.
రుణ బకాయి, అందని బీమా
ముగ్గు వెంకటాపురంలోని రేణుక గ్రూప్‌నకు రూ.3 లక్షల సీ్త్ర నిధి రుణం మంజూరైంది. ఇందులో బీమా రూ.20వేలు పోగా మిగతా రూ.2.80 లక్షలను ఏడుగురు సభ్యులు వాటాగా తీసుకున్నారు. రుణ మొ త్తాన్ని 2021 నాటికే చెల్లించినా, ప్రస్తుతం రూ.4.96 లక్షల బకాయి ఉందని రికార్డులో చూపిస్తున్నారని సభ్యులు చిలక పద్మ, చింతకాయల వెంకటరమణ వాపోయారు. అంతేకాక బీమా నగదు మినహా యించినా ఓ సభ్యురాలు 2023లో మృతి చెందితే రుణ బకాయి ఉందంటూ క్లెయిమ్ చేయలేదని తెలిపారు. అంతేకాక గ్రామానిరే చెందిన దుర్గమ్మ గ్రూప్ సభ్యులు 2020 సంవత్సరంలో రూ.2.5 లక్షల రుణం తీసుకుని 2023 నాటికి చెల్లించినా రికార్డులో బకాయిగా చూపిస్తున్నారని సభ్యలు చిలకా భాగ్యలక్ష్మి, శిరీష, రమ్య వెల్లడించారు. ఈమేరకు గ్రామంలోని 20 గ్రూపుల్లో ఇచ్చిన రూ.43 లక్షల రుణాలపై విచారణ చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం అశోక్‌రాణిని వివరణ కోరగా.. సీ్త్రనిధి రుణాలు, వసూళ్లకు సంబంధించి విచారణ జరిపిస్తామని చెప్పారు. డబ్బు చెల్లించిన మహిళలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
రుణాలు చెల్లించినా రికార్డుల్లో బకాయే..


