జెండా ఎగురవేయనున్న డిప్యూటీ సీఎం భట్టి | - | Sakshi
Sakshi News home page

జెండా ఎగురవేయనున్న డిప్యూటీ సీఎం భట్టి

Jun 2 2026 12:38 AM | Updated on Jun 2 2026 12:38 AM

నేడు పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం క్రైం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఖమ్మంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ఉదయం 8గంటలకు జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన ప్రసంగించనుండగా, ఆతర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన ఉంటాయి. ఈమేరకు పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మైదానాన్ని రంగవల్లులుతో తీర్చిదిద్దగా, స్టేజీ, గ్యాలరీల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.

జల వనరుల శాఖలో బదిలీలు

జిల్లాలో ఈఈలు, డీఈలకు స్థానచలనం

ఖమ్మంఅర్బన్‌: జల వనరుల శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. ఈమేరకు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(ఈఈలు), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల(డీఈలు)తో పాటు ఇతర కేడర్ల ఉద్యోగుల బదిలీ జరిగింది. ఖమ్మం ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఈఈ వెంకట్రావును ఇల్లెందుకు, సత్తుపల్లి ఈఈ శ్రీనివాస్‌రెడ్డిని పాలేరుకు బదిలీ చేశారు. అలాగే, డీఈల్లో నేలకొండపల్లి నుంచి మన్మఽథరావును జనగామ బదిలీ చేయగా, ఆయన స్థానంలో మహబూబాబాద్‌కు చెందిన పొట్టయ్యను నియమించారు. రఘునాథపాలెం డీఈ ఝాన్సీని తల్లాడకు బదిలీ చేయగా, కొత్తగూడెంలో పనిచేస్తున్న మోతీలాల్‌ను రఘునాథపాలెంకు కేటాయించారు. వైరా డీఈ శ్రీనివాస్‌ను మధిర బదిలీ చేయగా, మధిర నుంచి నాగబ్రహ్మయ్యను వైరాకు బదిలీ చేశారు. కొత్తగూడెం ఈఈ అర్జున్‌ను సత్తుపల్లి డీఎస్‌ఈగా నియమించారు. ఇక ఖమ్మం డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ పి.రాజును వరంగల్‌కు, ఎన్‌టీపీ రాజకుమారిని సూర్యాపేటకు బదిలీ చేసి ఆమె గద్వాలకు చెందిన శైలజారాణిని కేటాయించారు. అలాగే, సీఈ కార్యాలయంలో ఉన్న శోభారాణిని కొత్తగూడెం డీఈగా, ఎస్‌ఈ కార్యాలయంలో డీఈగా ఉన్న స్రవంతిని ఇల్లెందుకు బదిలీ చేశారు. అంతేకాక కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్లు, సిబ్బంది బదిలీలు కూడా జరిగాయి.

విధుల్లో చేరిన ఎంవీఐ, ఏఎంవీఐలు

ఖమ్మంక్రైం: రవాణా శాఖలో బదిలీల నేపథ్యాన ఉద్యోగులు సోమవారం నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. వైరా ఎంవీఐగా మెదక్‌ జిల్లా నుంచి వచ్చిన ఆర్‌.వెంకటస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తూ ఖమ్మం జిల్లా రవాణా కార్యాలయానికి బదిలీ అయిన ఏఎంవీఐ వెంకటస్వామి విధుల్లో చేరారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న రాజశేఖర్‌బాబు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా నుంచి రానున్న ప్రమీల, మధు మంగళ, బుధవారం విధుల్లో చేరనున్నారు. అలాగే, ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం ఏఓగా రాజశేఖర్‌ నియమితులయ్యారు. భద్రాచలం రవాణా శాఖ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఏఓగా బదిలీ కావడంతో విధుల్లో చేరారు. విధుల్లో చేరిన వారు జిల్లా ఇన్‌చార్జ్‌ రవాణా శాఖాధికారి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, వైరా ఎంవీఐగా పనిచేస్తున్న వెంకటరమణను హన్మకొండ డీటీసీకి బదిలీ చేశారు.

ఉష్ణోగ్రతలు పైకి.. కిందకు !

ఖమ్మంవ్యవసాయం: రోహిణి కార్తె ఆరంభం మొదలు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజుకోరకంగా నమోదవుతున్నాయి. ఓరోజు రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్లలో, మరో ఆరెంజ్‌, ఎల్లో జోన్ల స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటోంది. గత శుక్రవారం 42–45.2 డిగ్రీలుగా నమోదు కాగా, శనివారం 35.1 – 41.2 డిగ్రీలకు పడిపోయింది. మళ్లీ ఆదివారం 40.1 – 45.2 డిగ్రీల స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రత సోమవారం 35.4 – 41.4 డిగ్రీలుగా నమోదైంది. కాగా, ఉష్ణోగ్రతల్లో హెచ్చతగ్గులు ఉన్నా వేడి, వడగాలులు మాత్రం కొనసాగుతున్నాయి. జిల్లాలోని నేలకొండపల్లిలో సోమవారం అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బాణాపురం, బచ్చోడులో 41.3, పల్లెగూడెం, గుబ్బగుర్తి, పమ్మిలో 41.2, తిమ్మారావుపేటలో 41, కూసుమంచిలో 40.8, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌ వద్ద 40.5, కలెక్టరేట్‌ వద్ద 40.4 డిగ్రీలుగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement