‘అందరూ మంచి వారే కానీ..’ | - | Sakshi
Sakshi News home page

‘అందరూ మంచి వారే కానీ..’

Jun 1 2026 12:26 AM | Updated on Jun 1 2026 12:26 AM

● ఆలోచింపజేసిన నాటిక ● అలరించిన నెల నెలా వెన్నెల కార్యక్రమం

● ఆలోచింపజేసిన నాటిక ● అలరించిన నెల నెలా వెన్నెల కార్యక్రమం

ఖమ్మంగాంధీచౌక్‌: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన నెల నెలా వెన్నెల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుంటుంబ బాంధవ్యాలపై ప్రదర్శించిన ‘అందరూ మంచి వారే కానీ’నాటిక ఆలోచింపజేసింది. జరుగుల రామారావు రచించిన ఈ నాటికను రాజేశ్వరి, పూజిత, ముత్తవరపు పద్మారావు, సూర్య, జరుగుల రామారావులు ప్రదర్శించారు. తొలుత రామడుగు వసంత్‌ నిర్మించిన మేనమామ పాట వీడియోను ప్రదర్శించారు. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యూరో సర్జన్‌ డాక్టర్‌ పెంటేల అసాధారణ్‌ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత, నిబద్ధతను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నెల నెలా వెన్నెల నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అర్థవంతమైన సాంఘిక నాటికలను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారని, ఈ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్‌, మోటమర్రి జగన్మోహన్‌రావు, దేవేంద్ర, డాక్టర్‌ నాగబత్తిని రవి, నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement