మద్యం అమ్మకాల్లో కిక్కు! | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాల్లో కిక్కు!

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2025–26)లో లెక్కకు మిక్కిలిగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 – 2025లో రూ.167.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025–26లో మాత్రం రూ.2,297 కోట్లుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

కొత్త షాపులు, ఎన్నికలు

ఉమ్మడి జిల్లాలో 204 వైన్‌ షాపులు, 52 బార్లు, మూడు క్లబ్‌లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో వైన్స్‌ దక్కించుకున్న వారు భారీగా సరుకు కొనుగోలు చేశారు. అంతేకాక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయాన మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్టస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మార్చి 31న మంగళవారం ఒకేరోజు రూ.24.20కోట్ల విలువైన మద్యాన్ని వైరాలోని డిపో నుంచి వైన్స్‌, బార్ల యజమానులు తీసుకెళ్లారు. మొత్తం సంవత్సరంలో 27,576 కేసుల మద్యం, 1,63,1729 కేసుల బీర్ల అమ్మకాలు కొనసాగాయి.

2025–26లో రూ.2,297 కోట్లుగా నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement