రెండు కుటుంబాల్లో తీరని శోకం | - | Sakshi
Sakshi News home page

రెండు కుటుంబాల్లో తీరని శోకం

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

మట్టి క్వారీలో మునిగి ఇద్దరు బాలుర మృతి

సత్తుపల్లి ఎన్టీఆర్‌ కాలనీలో విషాదం

సత్తుపల్లిటౌన్‌: కళ్ల ముందు గుంత నిండా నీళ్లు.. మరోపక్క వేసవి తాపం... వెరసి సరదాగా ఈత కొడదామని ముగ్గురు బాలురు అందులోకి దిగారు.. ఈ విషయాన్ని గుర్తించి సమీపాన ఉన్న ఓ మహిళ ధైర్యం చేయడంతో ఒకరు ప్రాణాలతో బయటపడగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సత్తుపల్లిలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన వెంకటేశ్వరరావు, జానకికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి మూడో కుమారుడు నాగబాబు కుంచపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో 7వ తరగతి చదివేవాడు. అయితే, దంపతుల మధ్య కలహాల నేపథ్యాన ఐదు నెలలుగా తల్లి జానకి తన పుట్టినిల్లయిన సత్తుపల్లి ఎన్టీఆర్‌నగర్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెతో పాటు ఉండే నాగబాబు(12) స్కూల్‌కు వెళ్లకుండా అమ్మమ్మ గేదెలు మేపుతున్నాడు.

రోజులాగే వెళ్లి...

ఆదివారం కూడా రోజులాగే రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు నాగబాబు వెళ్లాడు. ఆయనతో పాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవా(11), షేక్‌ సైదులు సైతం వెళ్లారు. పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు ఒకరి తర్వాత ఒకరు దూకినా క్వారీ గుంత లోతు అంచనా వేయలేక నీళ్లల్లోకి జారిపోతూ కేకలు వేశారు. సమీపాన గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగి మరీ షేక్‌ సైదులు(చెర్రి)ను కాపాడింది. మరో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించినా నీళ్లల్లో మునిగిపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఎస్సై వీరప్రసాద్‌, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెహానాకమల్‌పాషా, బండారు శరత్‌చంద్ర, జగన్నాథం శ్రీను చేరుకున్నారు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా దేవా, నాగబాబు మృతదేహాలు లభించాయి. ఒకే కాలనీ చెందిన ఇద్దరు బాలుర మృతితో కాలనీ వాసులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుమారుడుఎన్టీఆర్‌నగర్‌కు చెందిన వంటిపులి శివ, తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు దేవా ఉన్నారు. పిల్లల చిన్న వయస్సులో తండ్రి శివ మృతి చెందాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌నగర్‌ జెడ్పీఎస్‌ఎస్‌లో ఏడో తరగతి చదువుతున్న దేవా మృతితో ఆ కుటుంబంలో విషా దం అలుకుముంది. పాఠశాలకు సెలవు కాకున్నా ప్రాణా లు దక్కేవని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ప్రమాదం నుంచి బయటపడిన షేక్‌ సైదులు(చెర్రి) ఎన్టీఆర్‌నగర్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement