ఖమ్మంగాంధీచౌక్: ఏసుక్రీస్తు బోధనలను ప్రజలకు అందిస్తూ ఆధ్యాత్మికత పెంచుతున్న నిజమైన సేవకులకే అవకాశం కల్పించాలని డోర్నకల్ డయాసిస్ బిషప్‌గా పోటీ చేస్తున్న కె.సేనంరాజు కోరారు. ఖమ్మంలో కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలోని సెయింట్ అండ్రూస్ చర్చిలో మే 10వ తేదీన బిషప్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిషప్‌గా తనతో పాటు ప్యానల్‌గా పోటీలో ఉన్న కేటీ.విజయ్‌కుమార్, ఆర్.ఇజ్రాయేల్‌రెడ్డి, జేజే.కాంతారాణిని గెలిపించి క్రైస్తవ సంఘాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని వివిధ జిల్లాల సభ్యులు ఐజక్ మల్లికార్జున్, ఆముదాల ప్రసాద్, ఈ.కిశోర్, రితేష్‌రెడ్డి, వేము కృష్ణ, నెమ్మది నవీన్, స్వర్ణప్రేమలత, శాంతారాజ్యం తదితరులు పాల్గొన్నారు.
డోర్నకల్ డయాసిస్ బిషప్ అభ్యర్థి సేనంరాజు


