‘బార్‌’ అధ్యక్ష పదవి బరిలో నలుగురు | - | Sakshi
Sakshi News home page

‘బార్‌’ అధ్యక్ష పదవి బరిలో నలుగురు

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

ఖమ్మంలీగల్‌: ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఈనెల 26న జరగనుండగా అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. అలాగే, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆరు పదవులకు ఒక్కొక్కరే మిగలడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కాగా, అధ్యక్ష పదవికి మోసెస్‌ క్రిస్టోఫర్‌ గోపోజి, రమేష్‌ యడ్లపల్లి, సుగ్గల వెంకటేశ్వరరావు గుప్తా, అయ్యదేవర విజయరాఘవ పోటీలో మిగిలారని ఎన్నికల అధికారులు పీఏజే.శేఖర్‌రాజ్‌, తౌఫిక్‌ అహ్మద్‌ తెలిపారు. అలాగే, ప్రధాన కార్యదర్శి పదవికి కుందుల అమరనాథ్‌, కొప్పుల రవికుమార్‌, తాళ్ల వెంకటనారాయణ పోటీలో ఉన్నారు. ఇక ఉపాధ్యక్షుడిగా షేక్‌ జానీమియా, సంయుక్త కార్యదర్శిగా దొబ్బల శిరీష, గ్రంథాలయ కార్యదర్శిగా దేవరకొండ కళ్యాణి, క్రీడా కార్యదర్శిగా ధరావత్‌ రాందాస్‌, కోశాధికారిగా వీకేడీ.రాజేశ్వరి, మహిళా ప్రతినిధిగా కనపర్తి రాధమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు.

ఆరు పదవులు ఏకగ్రీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement