ఖమ్మం సహకారనగర్ : కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులకు కనీస వేతనం మంజూరు చేయాలని, హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని కోరారు. వారి వేతనాలు కూడా అరకొరగా ఉన్నాయని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, డి.ఎస్.నాగేశ్వరరావు, రాజకుమారి, కవిత, విజయలక్ష్మి, అంబిక, విరిత, నాగేశ్వరరావు, నీలిమ, సత్యవతి పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని


