రిపబ్లిక్ డే పరేడ్‌కు గురుకులం విద్యార్థిని
కొణిజర్ల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్ గోల్కొండ కోటలో జరగనున్న పరేడ్‌కు తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ కేడెట్ పాయం దుర్గ ఎంపికై ంది. ఆమెను ప్రిన్సిపాల్ కె.రజిని, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, ఎన్‌సీసీ సీటీఓ కె.హేమభార్గవి, 11వ బెటాలియన్ అధికారులు అభినందించారు.
మున్సిపాలిటీలను
కై వసం చేసుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కై వసం చేసుకునేలా నేతలు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సూచించారు. జిల్లా అధ్యక్షులతో బుధవారం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆతర్వాత డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ జిల్లా నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జిగా మంత్రి కొండా సురేఖను అధిష్టానం నియమించిందని తెలిపారు. ఈమేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా శ్రేణులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
చకచకా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చుట్టూ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తికాగా, త్వరలోనే సింథటిక్ ట్రాక్ వేయనున్నారు. ఇందుకోసం కావాల్సిన గమ్, చిప్స్ తెప్పించారు. ఢిల్లీ, ముంబైకి చెందిన నిపుణులు రాగానే పనులు మొదలుకానున్నాయి. ట్రాక్ చుట్టూ గమ్ వేశాక సింథటిక్ చిప్స్ వేస్తారు. ఇలా రెండు సార్లు చిప్స్ వేయడం ద్వారా ట్రాక్ సిద్ధమవుతుంది.
జిల్లాకు 505 మె.టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు బుధవారం 505.35 మెట్రిక్ టన్నుల యూరియా బుధవారం చేరింది. ఈ యూరియా పూర్తిగా జిల్లాకే కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు చేరవేశామని వెల్లడించారు.
నయనానందం..
నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో రామయ్య నిత్యకల్యాణం బుధవారం నయనానందకరంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధ న పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక శాస్త్రోకంగా కల్యాణం జరిపించారు.
24, 25వ తేదీల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
రుద్రంపూర్: కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈనెల 24, 25వ తేదీల్లో కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాలోని గనులను పరిశీలించనున్నారు. ఈనెల 24న సాయంత్రం కొత్తగూడెం చేరుకోనున్న మంత్రి సింగరేణి డైరెక్టర్లు, జీఎంలతో సమావేశమైన ఉత్పత్తి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తారు. ఇక ఈనెల 25న ఉదయం యూనియన్ నాయకులతో సమావేశమయ్యాక సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఇల్లెందులోని కో యగూడెం ఓసీని కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు.


