మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, కౌంటింగ్ తదితర ఏర్పాట్లపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా విడుదల చేశామని తెలిపారు. అలాగే, పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, ఉద్యోగుల ఎంపిక కూడా పూర్తయిందని చెప్పారు. వీసీలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు కె. శ్రీరామ్, సునీల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్, నర్సింహ, రామచందర్‌రావు, గురులింగం తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతకు పకడ్బందీ చర్యలు
విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకుండా, విద్యాసంస్థలు రవాణా నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపడుతున్న చర్యలపై రవాణా శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈమేరకు రోడ్డు భద్రతను బలోపేతం చేసేలా రూపొందించిన నివేదికను రవాణాశాఖ కమిషనరేట్ డీసీటీ ఆఫ్రిన్ సిద్ధిఖీ కలెక్టర్‌కు సమర్పించారు. ఇటీవల పెనుబల్లిలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదం నేపథ్యాన 764 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశామని తెలిపారు. మిగిలినవి త్వరలోనే చేపడుతామని చెప్పారు. కొన్ని బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడం, ఇంజిన్ సమస్యలు గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యాన తరచుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఈ జిల్లా రవాణా అధికారి జగదీష్, ఎంవీఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
రాణి కుముదిని


