ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’పోస్ట్
తిరుమలాయపాలెం: అనుమతి లేకుండా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీపీ సునీల్‌దత్ ఆదేశాలతో మండలంలోని పాలేరు ఏటి నుండి ఇసుక అక్రమ రవాణా జరగకుండా కాకరవాయిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. కొంత కాలంగా మండలంలోని ముజాహిదిపురం పాలేరు ఏటితో పాటు హైదర్‌సాయిపేట పడమటితండా, అజ్మీరాతండా ఆకేరు నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా తరలిస్తున్నారు. పలుమార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా రవాణా ఆగడం లేదు. దీంతో నిరంతరం నిఘా కోసం కాకరవాయిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఏఆర్ కానిస్టేబుళ్లతో 24గంటల పాటు గస్తీ కాస్తున్నట్లు ఎస్సై కె.జగదీశ్ తెలిపారు. కాగా, హైదర్‌సాయిపేట పడమటితండాలోనూ నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.


