వైద్యసేవల్లో ఆశాల పాత్ర కీలకం
కొణిజర్ల: వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాల విజయవంతంలో ఏఎన్‌ఎం పాత్ర ముఖ్యం కాగా, వైద్యసేవల్లో ఆశా కార్యకర్తల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. కొణిజర్ల పీహెచ్‌సీలో మంగళవారం ఆశా డే సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు సాఫీగా అందాలంటే ఆశాల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంపు, నవజాత శిశువుల సంరక్షణ, వంద శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


