దొంగల ముఠా అరెస్ట్
రఘునాథపాలెం: వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరిని రఘునాథపాలెం పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ మేరకు వివరాలను ఖమ్మం ఏసీపీ ఎస్.వీ. రమణమూర్తి, సీఐ ఎం.డీ.ఉస్మాన్ షరీఫ్ మంగళవారం వెల్లడించారు. మండలంలోని కోయచలక క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నం చేశారు. దీంతో వారి ని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన లంజపల్లి శేఖర్ అలియాస్ టోనీ, రేగులచలకకు చెందిన జంగా వెంకన్న, కోయచలకకు చెందిన కొరకొప్పు ల నవీన్ ముఠాగా ఏర్పడినట్లు తేలింది. వీరు ఈ నెల 2న రేగులచలకలోని మహిళా కానిస్టేబుల్ పూజిత విధులకు వెళ్లగా ఇంటి వెనక తలుపులు పగలగొట్టి బీరువాలో దాచిన రూ.7,30,740 విలువైన 114 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల్లో టోనీ, వెంకన్న పట్టుబడగా నవీన్ పరారీలో ఉన్నాడని, వీరి నుంచి ఆభరణాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, టోనీపై గతంలో వైరా, ఖమ్మం రూరల్, ఏపీ రాష్ట్రంలోని జగ్గయ్యపేట ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. చోరీ కేసులో నిందితులను నాలుగు రోజుల్లోనే అరెస్ట్ చేసిన సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్‌ఐలు జి.నరేష్, ఎం.తేజేశ్వర్‌రెడ్డి, సిబ్బంది ఎస్.రవికుమార్, కె.సంజీవ్‌కుమార్, శ్రీనివాసులును సీపీ సునీల్‌దత్, ఏసీపీ రమణమూర్తి అభినందించారు.
రూ.7.30 లక్షల విలువైన నగలు స్వాధీనం


