అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎస్సీలకు పెద్దపీట వేయడమే కాక ఎస్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు చెప్పారు. అనంతరం జీపీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన 70మందిని సత్కరించారు. ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ దర్జీ చెన్నారావు, నాయకులు దాసరి దానియేలు, కొత్తా సీతారాములు, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, మూడుముంతల గంగరాజు యాదవ్, ముళ్లపూడి సీతారాములు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


