జెండా పండుగలో అందరూ పాల్గొనాలి
● డీసీసీ అధ్యక్షుడు
సత్యనారాయణగౌడ్
ఖమ్మంమయూరిసెంటర్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనతో ఈనెల 26న తలపెట్టిన జెండా పండుగలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని, ప్రతీ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెండా పండుగకు అవసరమైన సామగ్రిని జిల్లా కార్యాలయం నుంచి పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన పంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల జాబితాను ఈనెల 8లోగా జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా మంత్రులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో నాయకులు సూరంశెట్టి కిషోర్, గాలి దుర్గారావు, కొమ్మినేని రమేష్ బాబు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, వడ్డే నారాయణరావు, స్వర్ణ నరేంద్ర, కాసర చంద్రశేఖర్ రెడ్డి, శివ వేణు, పంది వెంకటేశ్వర్లు, కళ్లెం వెంకటరెడ్డి, వేజెండ్ల సాయికుమార్, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, బోజెడ్ల సతీష్ పాల్గొన్నారు.


