ఇది పోరాటాల నామ సంవత్సరం
కేటీఆర్ పర్యటన ఇలా..
● 7న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంవైరారోడ్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న జిల్లాలో పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2026 పోరాటాల నామ సంవత్సరమని, పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆందోళనలను ఉధృతం చేయాలని అన్నారు. నగరంలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ నీళ్ల కుట్ర చేస్తోందని, ఆ కుట్రలను ఎండగట్టేది బీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. ‘సీతారామ నీళ్లతో కాళ్లు కడుగుతా’ అనే హామీతో గెలిచిన ఖమ్మం నాయకుడు ఇప్పటికై నా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారదాహంతో బీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకుల పరిస్థితి నేడు వర్ణణాతీతంగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను ఈనెల 7న కేటీఆర్ సత్కరించనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మండల అధ్యక్షుడు వీరునాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్ణాటి కృష్ణ, మక్బూల్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమర్, బచ్చు విజయ్‌కుమార్, తాజుద్దీన్, కొల్లు పద్మ, మెంతుల శ్రీశైలం, రామ్మూర్తి, బత్తుల మురళి పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనుండగా షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో.. పార్టీ మద్ధతుతో ఉమ్మడి జిల్లాలో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా 7న ఉదయం ఉదయం 10 గంటలకు రాపర్తినగర్ ఆంజనేయస్వామి గుడి వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, కొత్త బస్టాండ్, ఎన్నెస్పీ క్యాంప్ మీదుగా బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.


