కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ
ఖమ్మంఅర్బన్ : బీఆర్‌ఎస్‌కు మరో ఎదరుదెబ్బ తాకింది. పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కార్పొరేటర్లు సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు చిరుమామిళ్ల లక్ష్మి(12వ డివిజన్), గోళ్ల చంద్రకళ(25వ డివిజన్), డోనవన్ సరస్వతి(32వ డివిజన్), దాదే అమృతమ్మ(40వ డివిజన్), మోతారపు శ్రావణి(55వ డివిజన్) మాట్లాడుతూ.. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరొందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్థవంతమైన నాయకత్వంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నడిపించే లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరామని, ఇది తమకు ఎంతో ఆనందమైన సందర్భమని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, కార్పొరేటర్ కమర్తపు మురళి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రావూరి సైదబాబు, చిరుమావిళ్ల నాగేశ్వరరావు, మోతారపు సుధాకర్, ఆళ్ల ఆంజిరెడ్డి పాల్గొన్నారు.


