ఆస్తుల కొనుగోలుకు చక్కని వేదిక
ఖమ్మంమయూరిసెంటర్: దళారుల ప్రమేయం లేకుండా ఆస్తుల కొనుగోలుకు క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో చక్కని వేదికగా నిలుస్తుందని ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ఎక్స్‌పో షోను శనివారం ఆమె నిర్వాహకులతో కలిసి ప్రారంభించాక మా ట్లాడారు. ఇళ్లు, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి, బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. క్రెడాయ్ జిల్లా అధ్యక్షుడు బండి జయ్‌కిశోర్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పోలో కార్పొరేట్ కంపెనీలు, జాతీయ బ్యాంకులు, ప్రముఖ రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణ మెటీరియల్ కంపెనీల బాధ్యులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ డీజీఎం ఎం.హనుమంతరెడ్డి, ఎస్‌బీఐ డీజీఎం బినోద్‌కుమార్ సిన్హా, కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, క్రెడాయ్ బాధ్యులు పెద్ది కేశవరావు, చెరుకుమల్లి వెంకటేశ్వర్లు, వేములపల్లి నగేశ్, కమతం కమల్, కొదుమూరు ఉమేశ్, ఎం.బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
‘క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో’ను
ప్రారంభించిన మేయర్


