అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి

Dec 8 2025 7:48 AM | Updated on Dec 8 2025 7:48 AM

అంతర్

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి

వైరా/కొణిజర్ల: ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వైరాకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. వైరాకు చెందిన మొండ్రు భాస్కర్‌ కొణిజర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీ యూనివర్సిటీలో కంపారిటివ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ( సీఈఎస్‌ఐ) వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘తెలంగాణలోని గ్రామీణ విద్యార్థుల్లో ప్రజాస్వామిక విలువలను పెంపొందించడం – ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడి అనుభవాలు’ అనే పత్రాన్ని భాస్కర్‌ సమర్పించారు. ఈ సదస్సులో పాల్గొనడానికి జిల్లా నుంచి అవకాశం లభించిన ఏకై క ఉపాధ్యాయడు ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా భాస్కర్‌ను పలువురు అధికారులు, ఉపాధ్యాయులు అభినందించారు.

17 మంది

హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతి

ఖమ్మంక్రైం : ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదో న్నతి కల్పిస్తూ భద్రాద్రి జోన్‌ డీఐజీ సన్‌ ప్రీత్‌సింగ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి లో ఏడుగురు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాగా, 10మంది భద్రాద్రి జిల్లా వారు ఉన్నారు.

సీనియర్లను టెట్‌ నుంచి మినహాయించాలి

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి

సత్తుపల్లిటౌన్‌: ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే సీనియర్‌ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి కోరారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. అశాసీ్త్రయమైన గురుకుల టైం టేబుల్‌ మార్చాలని, 010 పద్దు ద్వారా గురుకుల, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్‌ లెక్చరర్‌ పోస్టులను పదోన్నతల ద్వారా భర్తీ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు ఈ–కుబేర్‌లో ఉన్న పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, చెరుకు శ్రీనివాసరావు, సూరయ్య, అశోకచక్రవర్తి, శేషు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన

‘భలే మంచిరోజు’

ఖమ్మం గాంధీచౌక్‌ : ప్రసిద్ధ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సుధాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సునాద వినోదిని సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన భలే మంచిరోజు కార్యక్రమం అలరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి హెచ్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఖమ్మంలో 29 ఏళ్లుగా భలే మంచి రోజు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సుధాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధ్యక్షులు డాక్టర్‌ వాసుదేవ్‌ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి సంగీత విభావరి నిర్వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. సంస్థ ప్రధాన కార్యదర్శి శఠగోపం సుదర్శన్‌ మాట్లాడుతూ 1997 నుంచి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైన్నెకి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు జి.వి.మురళి, తెలుగు, హిందీ, కన్నడ సినీ గీత సాహిత్య విశ్లేషకులు జి.వి. శేషుబాబుతో పాటు మహ్మద్‌ అజీజ్‌, మహ్మద్‌ జాన్‌ సాహెబ్‌, కాళ్ల పాపారావు, కాటమనేని రమేష్‌, ఖమ్మం కళాపరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ నాగబత్తిని రవి, వినీలా సుదర్శన్‌ పాల్గొన్నారు.

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి1
1/2

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి2
2/2

అంతర్జాతీయ సదస్సులో వైరా వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement