తొలిపోరుకు సిద్ధం
ఈనెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
● 172 సర్పంచ్ స్థానాలకు, 1,582 వార్డులకు పోలింగ్ ● 20 మంది సర్పంచ్‌లు, 158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం ● ఎన్నికల విధుల్లో 4,220 మంది అధికారులు, సిబ్బంది
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి రోజురోజుకూ వేడెక్కుతోంది. జిల్లాలో 20 మండలాల పరిధిలో 574 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల పరిధిలో 192 సర్పంచ్ స్థానాలు, 1,740 వార్డులు ఉన్నాయి. ఇందులో 20 మంది సర్పంచ్ అభ్యర్థులు, 158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 172 సర్పంచ్ స్థానాలకు, 1,740 వార్డులకు 158 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా 1,582 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
1,582 బ్యాలెట్ బాక్సులు..
ఏడు మండలాల పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నిక ల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. 20 శాతం మంది రిజర్వ్‌తో కలిపి మొత్తంగా 1,899 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది 2,321 మంది విధులు నిర్వహించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కోబూత్ చొప్పున ఉంటుండగా.. 1,582 బ్యాలె ట్ బాక్సులను వినియోగించనున్నారు. ఈనెల 11వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2గంటల కు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
తొలిపోరుకు సిద్ధం


