‘నవోదయ’లో ముగిసిన సమ్మేళనం
కూసుమంచి : పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2000 – 2007 విద్యా సంవత్సరంలో చదివిన 14వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ముగిసింది. వివిధ హోదాల్లో స్థిరపడిన పలువురు హాజరు కాగా, రెండు రోజుల పాటు విద్యాలయలో సందడి నెలకొంది. విద్యాలయలో గతంలో పని చేసిన ప్రిన్సిపాళ్లు, ఆధ్యాపకులు సైతం హాజరై విద్యార్థులకు సందేశం అందజేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన గెస్ట్ రూమ్‌ను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు.


