● పోలీసు శాఖలో కీలకంగా హోంగార్డు ఆఫీసర్లు ● నేడు హోంగా
చేదోడు వాదోడుగా..
ఖమ్మంక్రైం: పోలీస్‌శాఖలో ఉద్యోగులకు చేదో డు వాదోడుగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డు ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నేడు(శనివారం) హోంగార్డుల రైజింగ్ డే జరుపుకోనుండగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.
1950నుంచి అమల్లోకి..
సైన్యం యుద్ధం చేసే సమయాన స్థానికంగా ప్రజలు, గృహాల రక్షణ కోసం స్వచ్ఛందంగా హోంగార్డులు సేవలందించేవారు. ఈమేరకు 1950లో హోంగార్డు పదం వాడుకలోకి వ చ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలా 1963లో పోలీసులకు సహాయకులుగా హోంగార్డు వ్యవస్థ మొదలుకాగా ప్రస్తుతం 62 ఏళ్లు నిండాయి. జిల్లాలో హోంగార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న 595మందిలో 66మంది మహిళలు ఉన్నారు.
ఉద్యోగ భద్రత కోసం....
పోలీసుల మాదిరి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏళ్లుగా హోంగార్డులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తమను మినీ పోలీసులుగా గుర్తించి, పోలీస్ సిబ్బంది మాదిరి అలవెన్స్ వర్తింపచేయాలని విన్నవిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు సరైన చికి త్స వారికి చేయించలేకపోతున్న తమ కుటుంబాలకు ఆరోగ్యభద్రత కల్పించాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలన్న తమ వినతులపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.


