అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

అండర్

అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: జాతీయస్థాయి పాఠశాలల అండర్‌–17 టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఖమ్మంకు చెందిన పరిటాల జ్వాలిత్‌, గద్దల సిరి ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రతిభ కనబర్చిన వీరిని 25నుంచి చైన్నైలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బా లసాని విజయ్‌కుమార్‌, వీవీఎస్‌.మూర్తి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు, సలహాదారుడు సైదులు అభినందించారు.

ఇద్దరికి ‘రైతురత్న’ అవార్డులు

కొణిజర్ల: మండలంలోని పల్లిపాడు, మల్లుపల్లికి చెందిన ఇద్దరు రైతులకు ‘రైతురత్న’ అవార్డులు లభించాయి. ఇటీవల హైదరాబాద్‌ శాంతివనంలో జరిగిన మహా కిసాన్‌ మేళాలో సేంద్రియ వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం చేసే రైతులకు పురస్కారాలు అందజేశారు. ఈమేరకు పల్లిపాడుకు చెందిన జాలాది రమేష్‌, మల్లుపల్లికి చెందిన మేడా కృష్ణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్లానింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

ఏపీ సీఎం సతీమణి వాహనం తనిఖీ

కూసుమంచి: జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్‌ వద్ద గురువారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్‌ నుండి ఏపీలోని జంగారెడ్డిగూడెంకు ఖమ్మం మీదుగా ఆమె వాహనంలో వెళ్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని చెప్పిన చెక్‌పోస్టు ఉద్యోగులు వాహనాన్ని తనిఖీ చేశాక పంపించారు.

ఖమ్మం నుంచి

శబరిమలైకు పాదయాత్ర

బయలుదేరిన నలుగురు మాలధారులు

ఖమ్మంక్రైం: అయ్యప్ప మాల ధరించిన నలుగురు భక్తులు శబరిమలలో స్వామి దర్శనానికి ఖమ్మం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. వణికిస్తున్న చలిలో వందల కి.మీ. మేర పాదయాత్రకు వీరు శ్రీకారం చుట్టారు. ఖమ్మం ఖానాపురానికి చెందిన గురుస్వామి హరి ఆధ్వర్యాన సతీష్‌, సిద్దూ, ఉమారావు మాల ధరించగా శబరిమలలో అయ్యప్ప దర్శనానికి పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కోదాడ హైవే మీదుగా బయలుదేరి గుంటూరు, ప్రకాశం, కడప మీదుగా తమిళనాడు ఆపై కేరళ చేరుకుంటామని తెలిపారు. ఇందులో హరి మాల ధరించడం ఇది 16వ సారి కాగా సుమారు 1,300 కి.మీ. మేర పాదయాత్రకు 50రోజుల సమయం పడుతుందని తెలిపారు. తమ వెంట వెంట ఓ వాహనం కూడా వస్తోంది. అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు. మార్గమధ్యలో ఆలయాల వద్ద వంట చేసుకుని, రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ యాత్ర సాగిస్తామని తెలిపారు.

అండర్‌–17 జాతీయ  టీటీ టోర్నీకి ఎంపిక
1
1/3

అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక

అండర్‌–17 జాతీయ  టీటీ టోర్నీకి ఎంపిక
2
2/3

అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక

అండర్‌–17 జాతీయ  టీటీ టోర్నీకి ఎంపిక
3
3/3

అండర్‌–17 జాతీయ టీటీ టోర్నీకి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement