పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
ఖమ్మం సహకారనగర్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అత్సవరస సేవల్లో పనిచేసే వారు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈ నెల 5 నుంచి 10 వరకు, రెండో విడత ఎన్నికలు జరిగే కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఈనెల 8 నుంచి 13 వరకు, మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూర్, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూర్, సింగరేణి మండలాల్లో ఈ నెల 11 నుంచి 16 వరకు ఆయా ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడి


