రేపు డీసీసీ అధ్యక్షుడిగా ‘నూతి’ ప్రమాణస్వీకారం
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి గా ఇటీవల నియమితులైన నూతి సత్యనారాయణ గౌడ్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుత అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నా రు. పార్టీ శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మంత్రి, ఎంపీని కలిసిన సత్యనారాయణ
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంఅర్బన్: డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించిన వారు.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమాల్లో నాయకులు విజయాబాయి, కొప్పుల చంద్రశేఖర్, ముళ్లపాటి సీతారాములు, సాధు రమేశ్‌రెడ్డి, గుత్తా వెంకటేశ్వర్లు, శ్రీరామనేని భాస్కర్, ఫరీద్‌ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.


