నేడు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మం అర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఖమ్మం 35వ డివిజన్ మోతీనగర్‌లో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే, మధ్యాహ్నం రెండు గంటలకు భద్రాద్రి జిల్లా అధికారులతో కొత్తగూడెంలో సమావేశమవుతారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పలుప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలాజీనగర్‌లోని సాయి డెంటినోవా హాస్పటల్, శ్రీ వెంకటేశ్వర క్లినిక్‌ను తనికీ చేసిన ఆయన నిబంధనల ప్రకారం ఆస్పత్రుల నిర్వహణ సాగుతోందా అని ఆరా తీసిన ఆయన వైద్యసేవలకు వసూలు చేస్తున్న ఫీజు, డాక్టర్ల పేర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను స్పష్టంగా కనిపించేలా అంటించాలని ఆదేశించారు. అలాగే, పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణ పరికరాలు, లిఫ్ట్ ఏర్పాట్లపై నిర్వాహకులకు సూచనలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
7వరకు ‘ఓపెన్’ ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్‌ఓ ప్రవేశాలకు వచ్చే నెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు తెలిపారు. పదో తరగతి అభ్యర్థులు రూ.100 అపరాధ రుసుము, ఇంటర్మీడియట్‌కై తే రూ.150అపరాధ రుసుముతో పాటు అడ్మిషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలకు 80084 03522 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అభ్యంతరాలు ఉంటే
తెలపండి
ఖమ్మం సహకారనగర్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) 8వ తరగతి పరీక్ష కీపై అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6వ తేదీలోగా తెలియచేయాలని డీఈఓ చైతన్య జైనీ సూచించారు. https://bse. telangana.gov.in వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యంతరాలు ఉన్న వారు dirgovexams.tg@gmail. com మెయిల్ ద్వారా లేదంటే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు నేరుగా సమర్పించవచ్చని వెల్లడించారు.
ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
మధిర: ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి అధికారి రవిబాబు సూచించారు. మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఎంసెట్, జేఈఈ మెయిన్స్‌కు శిక్షణ, ప్రాక్టికల్స్‌పై ఆరాతీశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలకు తరచుగా గైర్హాజరయ్యే విద్యార్థులను ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రత్యేక తరగతుల ద్వారా పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.జైదాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ ఆధ్వర్యాన
టెట్ శిక్షణ
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్‌ఫెడరేషన్(టీపీటీఎఫ్)జిల్లాకమిటీ ఆధ్వ ర్యాన టెట్‌శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మంలోని జెడ్పీ హాల్‌లో శిక్షణ తరగతులను శుక్రవారం అధికా ర మాసపత్రిక ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి.నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ శిక్షణ సంఘం జిల్లా కార్యాలయంలోప్రతిరోజు సా యంత్రం 6–30గంటల నుంచి 8–30గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. టీపీటీఎఫ్‌పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనో హ ర్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్.విజయ్, వై పద్మ పాల్గొని మాట్లాడగా నాయకులు టి.వెంగళరావు, ఉమాదేవి పాల్గొన్నారు.
నేడు మంత్రి తుమ్మల పర్యటన


