●ఏకగ్రీవం వైపు మొగ్గు
కామేపల్లి: మండలంలోని జోగ్గూడెంలో 787 మంది ఓటర్లకు గాను అందరూ గిరిజనులే. దీంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో గ్రామస్తులంతా పార్టీలకతీతంగా ఏకమై ఏకగ్రీవం దిశగా చర్చలు మొదలుపెట్టారు. గ్రామంలో ఆంజనేయస్వామి, గ్రామ దేవతల ఆలయ నిర్మాణానికి సహకరించే వారికే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించగా భూక్యా సైదమ్మ, అజ్మీరా శారద, హట్కర్ పార్వతీ, ఇస్లావత్ సరోజ, వాంకుడోత్ జ్యోతి, జర్పుల కమ్లీ, జర్పుల కవిత ముందుకొచ్చారు. చివరకు కాంగ్రెస్‌కు చెందిన భూక్యా లక్ష్మణ్‌నాయక్ భార్య సైదమ్మ ఆలయ నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలకు వచ్చినట్లు సమాచారం. అంతేకాక ఉపసర్పంచ్ పదవి కాంగ్రెస్‌కు, ఎనిమిది వార్డుల్లో నాలుగు కాంగ్రెస్‌కు, మూడు బీఆర్‌ఎస్‌కు, ఒకటి బీజేపీ ఇచ్చేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
●ఏకగ్రీవం వైపు మొగ్గు


