●ఒక్క క్లిక్‌తో ఓటరు జాబితా
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యాన పార్టీల నాయకులు, ఆశావహులే కాక ప్రజలు సులువుగా ఓటరు జాబితా పరిశీలించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈమేరకు తుదిజాబితాను tsec. gov. in వెబ్‌సైట్ ద్వారా వార్డుల వారీగా చూడొచ్చు. డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఫైనల్ డ్రాఫ్ట్ రోల్స్ అని కన్పిస్తుంది. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని కాప్చర్ కోడ్ నమోదు చేశాక వార్డుల వారీగా ఇంగ్లిష్, తెలుగులో జాబితా కనిపిస్తుంది. మనకు కావాల్సిన వివరాలు చూడడమే కాక అవసరమైతే పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


