అంతర్జాతీయ కథా సదస్సుకు ఆహ్వానం
సత్తుపల్లిరూరల్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యా న ఈనెల 30వ తేదీన ఆన్‌లైన్ వేదికగా జరిగే అంతర్జాతీయ బాల సాహిత్య భేరికి బాల రచయిత ఆవుల పోతురాజుకు ఆహ్వానం అందింది. వందకుపైగా బాల సాహితీవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సత్తుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పోతురాజు కథ వినిపించనున్నారు. ఇటీవలే ఆయన రాసిన కథల సంపుటి ‘నాన్నే నా హీరో’ విడుదలైన విషయం విదితమే. ఈ సందర్భంగా పోతురాజును పాఠశాల హెచ్‌ఎం ఎస్‌కే. సోదు, తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రమాదేవితో పాటు రామకృష్ణ, మధుసూదన్‌రాజు తది తరులు అభినందించారు.
సత్తుపల్లి డిప్యూటీ
డీఎంహెచ్‌ఓగా ప్రదీప్‌బాబు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఎం.ప్రదీప్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పనిచేసిన టి.సీతారాంపై ఆరోపణలు రావడంతో ఇటీవలే ఉన్నతాధికారులకు సరెండర్ చేశా రు. ఈ స్థానాన సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదా లో నల్లగొండ జిల్లా తిప్పర్తి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌బాబుకు డిప్యూ టీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి కల్పించి సత్తుపల్లికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరగా మెడికల్ ఆఫీసర్లు అవినాష్, చింతా కిరణ్‌కుమార్, ఇందుప్రియ, నవ్యకాంత్, రాములు, ప్రత్యూష, తబుసం, ఉద్యోగులు శుభా కాంక్షలు తెలిపారు.
లైసెన్స్ లేని
వ్యాపారికి జరిమానా
కారేపల్లి: లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారికి ఇల్లెందు వ్యవసాయ మా ర్కెట్ కార్యదర్శి నరేష్‌కుమార్ జరిమానా విధించారు. ఖమ్మంకు చెందిన కె.వెంకటనారా యణ లైసెన్స్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసుకొని డీసీఎం వాహనంలో తరలిస్తుండగా మండలంలోని గేట్ కారేపల్లి వద్ద అడ్డుకున్నారు. ఈమేరకు వ్యాపారి నుంచి మార్కెట్ ఫీజు రూ.2,800 వసూలు చేయడమే కాక లైసె న్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు రూ. 10వేలు జరిమానా విధించారు. మార్కెట్ సిబ్బంది సీహెచ్.లక్ష్మయ్య, జి.రంజిత్, వై.మధు, ఐ.సందీప్, ఇ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తుపాకీ కలిగిన వ్యక్తి అరెస్టు
ఖమ్మంవ్యవసాయం: కొణిజర్ల మండలంలో తుపాకీ కలిగి ఉన్న ఓ వ్యక్తిని శుక్రవారం అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి తుపాకీ, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకోగా ఖమ్మం ఫారెస్టురేంజ్ అధికారి స్వర్ణ బాలరాజు వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి యజమానికి కొణిజర్ల మండలంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా, ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తిరు రాజమేళతో పాటు మరో ముగ్గురిని కాపలా దారులుగా నియమించాడు. వ్యవసాయ క్షేత్రం పక్కన చేపల చెరువులు ఉండడంతో పశుపక్షాదులను అడ్డుకునేందుకు శబ్దాలు చేసేలా రాజ మేళ డబుల్ బ్యారెల్ 402 గన్ ఉపయోగిస్తున్నాడు. అయితే, తుపాకీకి ఏపీలో లైసెన్స్ ఉండగా, ఇక్కడకు తీసుకొచ్చి వినియోగించడం నేరం కావడంతో శుక్రవారం ఆయను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు న్యాయమూర్తి హాజరుపర్చి ఆయన ఆదేశాలతో14 రోజుల రిమాండ్ నిమిత్తం జిల్లా జైలుకు తరలించారు. కాగా, అక్రమ వేట, ఆయుధాల ఉపయోగం నేరమని డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ తెలిపారు. ఈమేరకు ఎవరైనా ఆయుధాలతోకనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.
అంతర్జాతీయ కథా సదస్సుకు ఆహ్వానం
అంతర్జాతీయ కథా సదస్సుకు ఆహ్వానం


