వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
300 / 170
జిల్లాలో బుధవారం ఉదయం, రాత్రి చలి, మంచు ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నంసాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.
మహిళల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● ఒకేరోజు రూ.19.27కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మధిర: మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిరలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి 4,782 సంఘాలకు రూ.4.99 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.60 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించగా, మంగళవారం ఒకేరోజు 19,670 ఎస్‌హెచ్‌జీలకు రూ 19.27 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల మందికి చీరల పంపిణీ పూర్తయిందని తెలిపారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటుకానున్న ఇందిరా మహిళా డెయిరీ కోసం 250 పాడి పశువులు పంపిణీ చేశామన్నారు. అలాగే, బోనకల్ మండలంలో రూ.1.75 కోట్లతో 9ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయగా, రూ.2కోట్ల వ్యయంతో రెండు మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్‌డీఓ నరసింహారావు, తహసీల్దార్ రాంబాబు, మార్కెట్, ఆత్మ కమిటీ చైర్మన్లు బండారు నరసింహారావు, కర్నాటి కోటేశ్వరరావు, నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, చావా రామకృష్ణ, సూరంశెట్టి కిషోర్, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


