నవభారత నిర్మాణానికి కృషి చేసిన పటేల్
ఖమ్మం రాపర్తినగర్: నవభారత నిర్మాణం కోసం పాటుపడిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడల్లో అందరూ పయనించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ ఆధ్వర్యాన మంగళవారం ఏర్పాటు చేసిన ఐక్యతా పాదయాత్ర(యూనిటీ మార్చ్)ను ఎంపీ ప్రారంభించి మాట్లాడారు. స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం తపన పడిన పటేల్, స్వాతంత్య్రం వచ్చాక సంస్థానాల విలీనానికి కృషి చేశారని తెలిపారు. మేరా యువభారత్ జిల్లా డీడీ చింతల అన్వేష్ మాట్లాడగా గిరిజన సంక్షేమ శాఖ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావుతో పాటు కె.రజని, కమర్తపు భానుచందర్, నాయుడు రాఘవరావు, రవిరాథోడ్, తొండపు సైదేశ్వరరావు, ఆర్.ఉదయ్‌కుమార్, సాంబమూర్తి, నాగరాజు, షారూఖ్ ఇమ్రాన్, చింతమల పాపయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పటేల్ స్ఫూర్తిని విస్మరించారు...
ఖమ్మం మామిళ్లగూడెం: దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకుంటూ నిర్వహించిన ఐక్యతా పరుగుకు హాజరుకాకుండా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పటేల్ స్ఫూర్తిని విస్మరించారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా జరుగుతున్న కార్యక్రమానికి గైర్హాజరు కావడం సరికాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు, నాయకులు ఈవీ.రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, గుత్తా వెంకటేశ్వర్లు, మందడపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
యూనిటీ మార్చ్‌ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర


