ఖైదీలకు వయోజన విద్య పుస్తకాలు
ఖమ్మంరూరల్: ప్రజలంతా అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని జిల్లా జైలులో కూడా అమలుచేయనున్నారు. ఈమేరకు రామన్నపేటలోని జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించేలా వయోజన విద్య శాఖ రూపొందించిన పుస్తకాలను అందజేశారు. వయోజన విద్య ఉప సంచాలకులు అనిల్‌కుమార్ మంగళవారం వీటిని జైలు సూపరింటెండెంట్ శ్రీధర్‌కు అందజేయగా, నిరక్షరాస్యులైన ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. జైలర్లు లక్ష్మీనారాయణ, సక్కు, డిప్యూటీ జైలర్లు హన్మంతరావు, సుభాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


