విద్యుత్ ఉద్యోగులకు ర్యాంకులు
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల ప్రతిభ, సేవల ఆధారంగా టీజీఎన్పీడీసీఎల్ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. ఎన్పీడీసీఎల్ సీఎండీగా వరుణ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులను ప్రోత్సహించేలా 2023 డిసెంబర్ నుంచి ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతీనెల డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఈమేరకు అక్టోబర్ నెల ర్యాంకులను మంగళవారం ప్రకటించగా, సబ్ డివిజన్ విభాగంలో ఖమ్మం టౌన్–1 ఏడీఈ సీహెచ్.నాగార్జునకు కంపెనీ స్థాయిలో రెండో ర్యాంకు లభించింది. అలాగే, రూరల్ సెక్షన్ విభాగంలో సత్తుపల్లి విద్యుత్ డివిజన్ వేంసూరు మండలం రాయుడుపాలెం సెక్షన్‌కు మూడో ర్యాంకు, అర్బన్ సెక్షన్లలో ఖమ్మం టౌన్ డివిజన్ పరిధి ఖమ్మం టౌన్–2 సెక్షన్‌కు ఐదో ర్యాంకు లభించింది. ఈమేరకు రాయుడుపాలెం ఏఈ అనిల్‌కుమార్, ఖమ్మం టౌన్–2 ఏఈ రవికుమార్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిని ఎస్‌ఈ గొట్టుముక్కల మహేందర్ తదితరులు అభినందించారు.
విద్యుత్ ఉద్యోగులకు ర్యాంకులు
విద్యుత్ ఉద్యోగులకు ర్యాంకులు


