అండర్‌–19 క్రికెట్‌ జట్లు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రికెట్‌ జట్లు సిద్ధం

Nov 19 2025 5:59 AM | Updated on Nov 19 2025 5:59 AM

అండర్

అండర్‌–19 క్రికెట్‌ జట్లు సిద్ధం

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్‌ కళాశాలల అండర్‌–19 బాలబాలికల క్రికెట్‌ జట్ల ఎంపిక పోటీలు మంగళవారం ఖమ్మంలోని సర్దా ర్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహించా రు. 95మంది బాలురు, 30మంది బాలికలు హాజరయ్యారు. ఈమేరకు ప్రతిభ కనబర్చిన వారితో జట్లను ఖరా రు చేసినట్లు అండర్‌–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసాకలీంతెలిపారు. బాలురజట్టులో పి.మణి కంఠ,ఎస్‌.కె.మహ్మద్‌అమీర్‌, జి.కార్తీక్‌, టి.ముకేశ్‌ కుమార్‌, ఎం.డీ.నజీర్‌ఖాన్‌, జి.రోహిత్‌, పి.వివేక్‌, ఎస్‌.కే.ఫాహిద్‌, టి.ధ్రువతేజ, పి.మోహిత్‌కు మార్‌, ఎస్‌.పూర్ణఅజయ్‌, ఎస్‌.నిమిష్‌, ఎం. సు రాజ్‌,కె.ప్రణయ్‌, ఎం.శ్యామ్‌, కె.మహేశ్వర్‌సాయి తో పాటు స్టాండ్‌బైలుగా పి.సాయికృష్ణ, టి.హర్షవర్దన్‌, ఎస్‌.కే.ఫర్హాన్‌ అహ్మద్‌కు స్థానం దక్కింది. అలాగే, బాలికల జట్టుకు ఝూన్సీ, వైష్ణవి, నేమాల, గ్రీష్మ, పావని, కీర్తన, బిందు, శ్రీ నిధి, స్పందన, రూప, కీర్తన, ఆరాధ్య ఎంపికయ్యారు.

జార్ఖండ్‌ వాసి

కుటుంబం చెంతకు...

ఖమ్మంరూరల్‌: మతిస్థిమితం తప్పి తిరుగుతు న్న వ్యక్తిని చేరదీసిన అన్నం ఫౌండేషన్‌ బాధ్యులు ఆయనకు చికిత్సచేయించి కోలుకున్నాక కుటుంబం చెంతకు చేర్చారు. ఈ ఏడాది జూలై 25న మతిస్థిమితం తప్పిన వ్యక్తి తిరుగుతుండగా స్థాని కులు ఇచ్చిన సమాచారం పోలీసులు ఆయనను అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావుకు అప్పగించారు. అప్పటి నుండి వైద్యం చేయిస్తుండగా, ఇటీవల కోలుకున్న సదరు వ్యక్తి తన పేరు రాజేందర్‌కుమార్‌ అని, తమది జార్ఖండ్‌ రాష్ట్రంలోని లోట్వా గ్రామంగా చెప్పడంతో ఖమ్మం రూరల్‌ పోలీసుల ద్వారా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న రాజేందర్‌ కుటుంబీకులు మంగళవారం రావడంతో రూరల్‌ సీఐ ముష్క రాజు సమక్షాన అప్పగించారు.

కుటుంబ సభ్యులకు అప్పగింత

ఖమ్మం అర్బన్‌: మతిస్థిమితం తప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని చేరదీసిన ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌ బాధ్యులు ఆయనకు వైద్యం చేయించి కోలుకున్నాక కుటుంబం చెంతకు చేర్చారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన 60ఏళ్ల నాగండ్ల వెంకటరెడ్డి ఖమ్మంలో తిరుగుతుండగా జూన్‌ 3వ తేదీన అన్నం సేవా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు చేరదీశారు. తమ ఆశ్రమంలో చేర్చుకుని వైద్యం చేయించారు. ఆయన కోలుకున్నాక తన పేరు, వివరాలు చెప్పడంతో వెంకటరెడ్డి భార్య చెన్నమ్మ ఆచూకీ తెలుసుకుని మంగళవారం అప్పగించారు.

ఉద్యాన పంటలతో

అధిక లాభాలు

రఘునాథపాలెం: రైతులు సంప్రదాయ పంటలకు బదులు ఉద్యాన పంటలను సాగు చేస్తే మంచి లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్‌ తెలిపారు. మండలంలోని జింకల తండాలో రైతు రామారావు బొప్పాయి, టమోటా సాగుచేస్తుండగా మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం పంటల్లో చీడపీడల గుర్తింపు, సస్యరక్షణ చర్యలపై అవగా హన కల్పించారు. అలాగే, భావుసింగ్‌ వేసిన ఆయిల్‌పామ్‌ తోటను పరిశీలించాక మాట్లాడారు. పత్తి, వరి, మిరప వంటి సంప్రదాయ పంటల కన్నా బొప్పాయి, టమోటా, ఆయిల్‌పామ్‌, ఇతర ఉద్యా న పంటలు సాగుచేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని తెలిపారు. ఉద్యాన అధికారి నగేష్‌, హెచ్‌ఈఓ జరీనా, గోద్రెజ్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ చంద్రు తదితరులు పాల్గొన్నారు.

అండర్‌–19  క్రికెట్‌ జట్లు సిద్ధం1
1/2

అండర్‌–19 క్రికెట్‌ జట్లు సిద్ధం

అండర్‌–19  క్రికెట్‌ జట్లు సిద్ధం2
2/2

అండర్‌–19 క్రికెట్‌ జట్లు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement