నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి నిత్యకల్యాణం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
కనీస పింఛన్‌గా రూ.9,500 చెల్లించాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ఈపీఎస్–95 పెన్షన్ దారులకు కనీసం రూ.9,500 పింఛన్ చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఖమ్మం ప్రావిడెంట్ ఫండ్ కార్యాల యం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు ఎల్.గోపీచంద్, కళ్యాణం నాగేశ్వరరావు, నాయకులు రవికుమార్, రామారావు, భాస్కర్‌రెడ్డి, నర్సింహారావు, మోహన్‌రావు, బాషా, రామ య్య, కొండలరావు, రాములు పాల్గొన్నారు.
అభ్యంతరాలు సమర్పించండి
ఖమ్మవైద్యవిభాగం: జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అందిన దరఖాస్తులపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని డీఎంహెచ్‌ఓ రామారావు ఒక ప్రకటనలో సూచించారు. అంతేకాక 21వ తేదీ లోగా సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.


