న్యూమోనియాను తొలిదశలోనే గుర్తించాలి
ముదిగొండ: ఐదేళ్ల లోపు పిల్లలకు న్యూమోనియా సోకే అవకాశమున్నందున, తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయించాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు సూచించారు. ముదిగొండలోని పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆరోగ్య మహిళా పథకంలో భాగంగా మహిళలకు స్క్రీనింగ్ పరీక్షల అనంతరం అవసరమైతే జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయాలని ఆదేశించారు. అలాగే, మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించాలని, తల్లీశిశువుల చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అంతేకాక చికిత్స కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేశారు. అనంతరం ముదిగొండలోని ప్రైవేట్ ల్యాబ్‌లను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. వైద్యాధికారి అరుణాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు.


